Share News

Airport Construction సీఎం చంద్రబాబు చొరవతోనే ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:01 AM

Airport Construction Completed Due to CM Chandrababu’s Initiative ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం త్వరితగతిన పూర్తయిందని టీడీపీ అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షురాలు ఎం.తేజోవతి అన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఎటువంటి అభివృద్ధి జరిగినా.. అదంతా తన కృషి వల్లేనని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Airport Construction   సీఎం చంద్రబాబు చొరవతోనే ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి
మాట్లాడుతున్న టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు తేజోవతి

టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు తేజోవతి

బెలగాం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం త్వరితగతిన పూర్తయిందని టీడీపీ అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షురాలు ఎం.తేజోవతి అన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఎటువంటి అభివృద్ధి జరిగినా.. అదంతా తన కృషి వల్లేనని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోమవారం ఎమ్మెల్యే విజయచంద్ర క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సీఎం చంద్రబాబు పూనుకుంటే.. నాడు జగన్‌ ఎన్నో విమర్శలు చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు వల్ల ఏం ఉపయోగమని అన్నారు. నాడు ఎన్నో అడ్డుంకులు సృష్టించారు. కానీ నేడు తొలి విమానం ఎగిరే సరికి జగన్‌ మాట మార్చారు. ఇదంతా నా వల్లే జరిగిందని జగన్‌ చెప్పడం విడ్డూరంగా ఉంది.’ అని చెప్పారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని ఆమె హితవు పలికారు. గత ఐదేళ్లు కూడా టీడీపీ అధికారంలో ఉండుంటే ఎప్పుడో ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయ్యేదన్నారు. అనంతరం ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ.. అంతా తానే చేశానని జగన్‌ కబుర్లు చెబుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కృషి కారణంగా భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయిందని తెలిపారు. దీనివల్ల ఉత్తరాంధ్ర ఎంతగానో అభివృద్ధి చెందుతుందని, ఎంతో మంది ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి పొందుతారని చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బోను చంద్రమౌళి, రౌతు వేణు, కౌన్సిలర్లు గౌరు నాయుడు, మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 12:01 AM