Share News

10th class ‘పది’లో మరోసారి మెరవాలని..

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:29 AM

Aiming to Shine Once Again in the 10th class పదో తరగతి ఫలితాల్లో మరోసారి మన్యం జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ అడుగులు వేస్తోంది దీనిలో భాగంగానే పాఠశాలల పర్యవేక్షణ, పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రమాణాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఏపీ మోడల్‌ పాఠశాలల జేడీ సుల్తానాను జిల్లా ప్రత్యేక అధికారిగా నియమించారు. మరోవైపు ఎంఈవోలకు పాఠశాలల బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోని 190 పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా వారు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

 10th class ‘పది’లో మరోసారి మెరవాలని..

  • ప్రత్యేక అధికారి నియామకం

  • ఎంఈవోలకు పాఠశాలల దత్తత

పార్వతీపురం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో మరోసారి మన్యం జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ అడుగులు వేస్తోంది దీనిలో భాగంగానే పాఠశాలల పర్యవేక్షణ, పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రమాణాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఏపీ మోడల్‌ పాఠశాలల జేడీ సుల్తానాను జిల్లా ప్రత్యేక అధికారిగా నియమించారు. మరోవైపు ఎంఈవోలకు పాఠశాలల బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోని 190 పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా వారు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు ఒక్కో ఎంఈవో ఐదు పాఠశాలలను దత్తత తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. అదే విధంగా కలెక్టర్‌తో పాటు ప్రతి శాఖ జిల్లా అధికారి, విద్యాశాఖ రీజనల్‌ డైరెక్టర్‌, ప్రత్యేక అధికారి సుల్తానా కూడా ఒక్కో పాఠశాల చొప్పున దత్తత తీసుకోవాల్సి ఉంది. ఈ ఏడాది కూడా టెన్త్‌లో శత శాతం ఫలితాలను సాధిస్తామని డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు. మరోసారి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అధికారులమంతా పాఠశాలలను దత్తత తీసుకుని టెన్త్‌ విద్యార్థుల విద్యా ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నామని శుక్రవారం వెల్లడించారు

Updated Date - Nov 14 , 2026 | 12:29 AM