Share News

Top Rank in Class 10 మరోసారి ‘పది’లో ప్రథమ స్థానంలో నిలవాలని..

ABN , Publish Date - Feb 28 , 2026 | 11:48 PM

Aiming Once Again for the Top Rank in Class 10 పదో తరగతి ఫలితాల్లో గత మూడేళ్లుగా జిల్లా ప్రథమ స్థానం సాధించింది. ఈ ఏడాది కూడా మరోసారి రాష్ట్రస్థాయిలో మన్యాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 183 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పాఠశాలల పరిశీలనకు గాను 15 మండలాలకు చెందిన ఎంఈవో-1,2తో పాటు ఎస్‌ఎస్‌ఏ అధికారులతో ఏడు తనిఖీలు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు శనివారం నుంచి జిల్లాలో ఉన్నత పాఠశాలలను పరిశీలించాయి.

  Top Rank in Class 10 మరోసారి ‘పది’లో ప్రథమ స్థానంలో నిలవాలని..
మామిడిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలిస్తున్న ఎంఈవోల తనిఖీ బృందం

  • ఆరంభమైన పరిశీలనలు

సాలూరు రూరల్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో గత మూడేళ్లుగా జిల్లా ప్రథమ స్థానం సాధించింది. ఈ ఏడాది కూడా మరోసారి రాష్ట్రస్థాయిలో మన్యాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 183 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పాఠశాలల పరిశీలనకు గాను 15 మండలాలకు చెందిన ఎంఈవో-1,2తో పాటు ఎస్‌ఎస్‌ఏ అధికారులతో ఏడు తనిఖీలు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు శనివారం నుంచి జిల్లాలో ఉన్నత పాఠశాలలను పరిశీలించాయి. టీం ఒకటికి మూడు మండలాలు, మిగిలిన ఆరు బృందాలకు రెండేసి మండలాల చొప్పున 183 ఉన్నత పాఠశాలలను ట్యాగ్‌ చేశారు. ఈ బృందాలు వచ్చే నెల ఏడో తేదీ వరకు షెడ్యూల్‌ ప్రకారం ఉన్నత పాఠశాలలను తనిఖీ చేయనున్నాయి. విద్యాప్రమాణాల బలోపేతం, పదో తరగతి ఫలితాల్లో దాదాపు శతశాతం సాధన, పాఠశాలల మౌలిక సదుపాయాలపై సమగ్ర పర్యవేక్షణ చేయనున్నాయి. పాఠశాల, విద్యార్థుల ముస్తాబు, ప్రాంగణ పరిశుభ్రత, ఆరు నుంచి పదో తరగతి వరకు బోధన పరిస్థితి, వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ మధ్యాహ్నభోజనం నిర్వహణ, కిచెన్‌, ఆటస్థలం, క్రీడలు, రికార్డులు, రిజిస్టర్లును తనిఖీ చేసి సమగ్ర నివేదికలను అందించనున్నాయి. కాగా తొలిరోజు సాలూరు మండలంలో మావుడి, తోణాం, మామిడిపల్లి పాఠశాలలను బలిజిపేట ఎంఈవోలు సింహాచలం, శ్రీనివాసరావు, మక్కువ ఎంఈవోలు శ్యాం, రాజశేఖర్‌ తదితరులు తనిఖీ చేశారు. మక్కువ మండలంలో ఎ.వెంకమ్మపేట, వెంకటబైరిపురం పాఠశా లలను పాచిపెంట,పార్వతీపురం ఎంఈవోలు, సహాయ ఏఎల్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ విజయకుమార్‌, సతీష్‌కుమార్‌ తదితరులు పరిశీలించారు.

Updated Date - Feb 28 , 2026 | 11:48 PM