Share News

AI to Play a Key Role పోలీసుల విధుల్లో ఏఐ కీలకపాత్ర

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:16 AM

AI to Play a Key Role in Policing Duties పోలీసుల విధుల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. బుధవారం పోలీస్‌ సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

AI to Play a Key Role   పోలీసుల విధుల్లో  ఏఐ కీలకపాత్ర
నేర సమీక్షలో మాట్లాడుతున్న ఎస్పీ మాధవరెడ్డి

  • హెల్మెట్‌ ప్రాముఖ్యత తెలియజేయాలి

  • నేర సమీక్షలో ఎస్పీ మాధవరెడ్డి

బెలగాం, మార్చి18(ఆంధ్రజ్యోతి): పోలీసుల విధుల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. బుధవారం పోలీస్‌ సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బందితో ఆయన మాట్లా డుతూ.. గంజాయి రవాణా, హాట్‌స్పాట్‌లపై డ్రోన్‌లతో నిఘా పెట్టాలన్నారు. గంజాయిని వినియో గించే వారి సాయంతో విక్రయించే ప్రాంతాలను కనిపెట్టాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రహదారి భద్రతా నియమాలు, ఈ-చలానా, హెల్మెట్‌ వినియోగంపై విస్త్రత ప్రచారం చేయాలని సూచించారు. ప్రత్యేకంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ చేపట్టాల న్నారు. వాట్సాప్‌ గవర్నెస్‌ సేవలు అన్ని పోలీస్‌ స్టేషన్లలో ప్రజలకు కనిపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో సారా నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని తెలిపారు. మహిళా సంబంధిత కేసుల దర్యాప్తును త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సాంకేతికతను జోడించి పెండింగ్‌ కేసులను పరిష్కరించాలని సూచించారు. సుదీర్ఘ పెండింగ్‌ కేసుల దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు చార్జిషీట్‌ సమర్పించాలన్నారు. పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో పొందుపరచాలని తెలిపారు. సైబర్‌ నేరాలు, శక్తి యాప్‌, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్‌ ప్రాముఖ్యతను తెలియజేసేలా రూపొందించిన లఘు చిత్రాన్ని ఎస్పీ ఆవిష్కరించారు. పలువురు సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సమీక్షలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎస్పీ రాంబాబు, డీసీఆర్‌బీ సీఐ ఆదాం, ఎస్బీ సీఐ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:16 AM