Share News

అగ్రిగోల్డ్‌ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:21 AM

అగ్రిగోల్డ్‌ కంపెనీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అగ్రిగోల్డ్‌ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

అగ్రిగోల్డ్‌ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి
మాట్లాడుతున్న నాగేశ్వరరావు

రామభద్రపురం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్‌ కంపెనీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అగ్రిగోల్డ్‌ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం మండలంలోని ఆరికతోటలో ఉన్న అగ్రిగోల్డ్‌ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అసెంబ్లీ సమావేశాల్లో అగ్రిగోల్డ్‌పై ప్రభుత్వం ఒక ప్రక టన చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మార్చి రెండో తేదీ నుంచి రిలేదీక్షలు, ఐదు నుంచి నిరవదిక నిరాహారదీక్షలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అగ్రిగోల్డ్‌ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఈవీ నాయుడు, అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అరేలమ్మ, పార్వతీపురం మన్యం సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్‌వీఎస్‌ కుమార్‌ పాల్గొన్నారు.

కార్పొరేట్లకే వ్యతిరేకం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ కార్మికులకు అన్యా యం చేస్తోందని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాల నాగేశ్వరరావు ఆరోపించారు. ఆరికతోటలో విలేకరులతో మాట్లాడుతూ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాము కార్పొరేట్లకే తాము వ్యతిరేకమని, పరిశ్రమలకు కాదని తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ధారాదత్తం చేయడానికి మోదీ ప్రభుత్వం కుయక్తులు పన్నుతోందన్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. రాష్ట్రంలో పేదలకు అండగా వామపక్ష పార్టీలు మాత్రమే పోరాటాలు చేస్తాయని తెలిపారు.

Updated Date - Feb 25 , 2026 | 12:21 AM