A Grade వైద్య సేవల్లో మన్యానికి ఏ గ్రేడ్
ABN , Publish Date - Jun 05 , 2026 | 11:46 PM
Agency Area Earns an A Grade in Healthcare Services జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న మెరుగైన వైద్య సేవలకు గాను మన్యానికి ప్రభుత్వం ఏ గ్రేడ్ ప్రకటించిందని డీసీహెచ్‌ఎస్ జి.నాగభూషణరావు తెలిపారు.
పార్వతీపురం/బెలగాం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న మెరుగైన వైద్య సేవలకు గాను మన్యానికి ప్రభుత్వం ఏ గ్రేడ్ ప్రకటించిందని డీసీహెచ్‌ఎస్ జి.నాగభూషణరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలు, మరికొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర సర్కారు గ్రేడ్‌లను ప్రకటించిందన్నారు. ఇన్‌పేషెంట్, స్కానింగ్, స్రసవాలు, ఈసీజీ, ల్యాబ్ టెస్ట్‌లు, బెడ్లు తదితర అంశాల్లో మెరుగ్గా ఉన్న తొమ్మిది జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రులకు ఏ గ్రేడ్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ జాబితాల్లో మన్యం జిల్లా ఉండడం గర్వకారణంగా ఉందన్నారు. భవిష్యత్‌లో కూడా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.