Share News

After working hard for the goal.. achieved Group-2 లక్ష్యం కోసం శ్రమించి.. గ్రూప్‌-2 సాధించి

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:32 AM

After working hard for the goal.. achieved Group-2 ఆమెకు 19వ ఏటా వివాహమైంది. చిన్న వయసులో పెళ్లి జరిగినా లక్ష్యం మార్చుకోలేదు. మంచి అధికారిగా ఉండాలన్న నాన్న కోరికను నరనరాన జీర్ణించుకున్న ఆమె అదే ఆశయం కోసం కష్టపడ్డారు. ఆత్మస్తైర్యంతో ముందుకు సాగితే సాధించలేనిది ఉండదని నిరూపించిన ఆమె పేరు లాలం రామలక్ష్మి. బొబ్బిలి మునిసిపల్‌ కమిషనర్‌.

After working hard for the goal.. achieved Group-2 లక్ష్యం కోసం శ్రమించి.. గ్రూప్‌-2 సాధించి
మునిసిపల్‌ కమిషనరు లాలం రామలక్ష్మి

లక్ష్యం కోసం శ్రమించి.. గ్రూప్‌-2 సాధించి

నాన్నకు ఇచ్చిన మాట నెరవేర్చిన రామలక్ష్మి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కథనం

బొబ్బిలి, మార్చి 7(ఆంధ్రజ్యోతి):

ఆమెకు 19వ ఏటా వివాహమైంది. చిన్న వయసులో పెళ్లి జరిగినా లక్ష్యం మార్చుకోలేదు. మంచి అధికారిగా ఉండాలన్న నాన్న కోరికను నరనరాన జీర్ణించుకున్న ఆమె అదే ఆశయం కోసం కష్టపడ్డారు. ఆత్మస్తైర్యంతో ముందుకు సాగితే సాధించలేనిది ఉండదని నిరూపించిన ఆమె పేరు లాలం రామలక్ష్మి. బొబ్బిలి మునిసిపల్‌ కమిషనర్‌.

తండ్రి పొలం పనుల్లో పడిన కష్టాన్ని చూస్తూ పెరిగిన రామలక్ష్మి పైతరగతులను హాస్టల్‌లో ఉంటూ చదువుకునేది. సెలవు రోజుల్లో ఇంటికొచ్చినప్పుడు నాన్నకు వ్యవసాయంలో సహాయంగా ఉండేది. ‘తనలా కష్టపడే బతుకు నీకొద్దు...దర్జాగా ఓ మంచి అధికారిగా ఎదగాలమ్మా’ అని తరచూ నాన్న అంటుండేవాడు. ఆ మాటలనే స్ఫూర్తిగా తీసుకొన్న రామలక్ష్మి ఎప్పటికైనా ఉన్నత ఉద్యోగం సాధించాలని కంకణం కట్టుకుంది. గ్రూపు-2 పరీక్షల్లో రాష్ట్రస్ధాయిలో మహిళా టాపర్‌గా నిలిచి మునిసిపల్‌ కమిషనరుగా ఎంపికైంది. 2018లో గ్రూపు -2లో ఎంపికయ్యాక మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మునిసిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టింది. ఈ ఉద్యోగంలో చేరే నాటికి ఆమెకు వివాహమైంది. 19 ఏళ్ల వయస్సులోనే(2013) వివాహం జరిగినా చెక్కుచెదరని సంకల్పంతో ఉన్నత ఉద్యోగం సాధించింది. ఈమె భర్త చొక్కాకుల కన్నంనాయుడు ఆర్మీలో సిగ్నల్‌ విభాగంలో నాయక్‌గా విధుల్లో ఉన్నారు. ఏడేళ్ల కుమారుడు పేరు యోచన్‌నాయుడు కాగా నాలుగేళ్ల కుమార్తె పేరు యశస్విని. ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ‘ఆంధ్రజ్యోతి’తో కమిషనరు లాలం రామలక్ష్మి మాట్లాడుతూ ప్రతి మహిళ ఆత్మస్తైర్యం కలిగి ఉండాలని, మనోఽధైర్యంతో ముందుకు సాగితే మహిళలు అన్నిరంగాలలో రాణిస్తారని చెప్పారు.

Updated Date - Mar 08 , 2026 | 12:32 AM