Share News

పుష్కర కాలం తర్వాత..

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:36 AM

స్థానిక సీతారామస్వామి ఆలయానికి సంబంధించిన భూములకు 12 ఏళ్ల (పుష్కరం) తర్వాత శుక్రవారం వేలంపాట నిర్వహించారు.

పుష్కర కాలం తర్వాత..
దేవస్థాన భూములను వేలంపాట నిర్వహిస్తున్న అధికారులు

  • సీతారామస్వామి ఆలయ భూములకు వేలంపాట

  • పోటా పోటీగా పాటదారులు..

  • దేవస్థానానికి రూ.లక్షల్లో ఆదాయం

గజపతినగరం, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): స్థానిక సీతారామస్వామి ఆలయానికి సంబంధించిన భూములకు 12 ఏళ్ల (పుష్కరం) తర్వాత శుక్రవారం వేలంపాట నిర్వహించారు. శ్రీరంగరాజపురం పంచాయతీ పరిధిలోని 47.54 ఎకరాల భూములకు ఆలయ ఈవో శ్రీరామ్‌ పర్య వేక్షణలో జిల్లా దేవదాయ ఇన్‌స్పెక్టర్‌ జి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో మొత్తం 73మంది రైతులు రూ.5వేలు చొప్పున ధరావత్తు చెల్లించి పాల్గొన్నారు. గతంలో ఎకరాకు భూమిని బట్టి రూ.1500 నుంచి రూ.3000 వరకు ఏడాదిపాటు కౌలు చేసుకునేందుకు రైతులు చెల్లించేవారు. గత 12 ఏళ్లగా వేలంపాట నిర్వహించకపోవడంతో కౌలు కూడా సక్రమంగా అందేది కాదు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసు బందోబస్తు నడుమ సంబంధిత అధికారులు వేలంపాట నిర్వహించగా.. 15 మంది రైతులు పాట ద్వారా కౌలుకు భూమికి సాగు హక్కులు దక్కించుకున్నారు. వారి వివరాలు ఇలా.. సర్వే నెంబర్‌ 20/6లో 8.54 ఎకరాలు కొత్త శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన అగూరు రామకృష్ణ రూ.55వేలకు, సర్వే నెంబర్‌ 26/1లో 7.40 ఎకరాలు రూ.75వేలకు పాట దక్కించు కున్నారు. అలాగే 27 సబ్‌ డివిజన్‌లో 3.60 ఎకరాలు రూ.43వేలకు గిడిజాల గోవింద, 28సబ్‌ డివిజన్‌లో 2.10 ఎకరాలు రూ.27వేలకు పంట్ల అప్పలనాయుడు, 29 సబ్‌ డివిజన్‌లో 1.51 ఎకరాలు రూ.23వేలకు ఆకిరి సత్యారావు, 31 సబ్‌ డివిజన్‌లో 79సెంట్లు రూ.30వేలకు వరుపుల శ్రీనివాసరావు, 33 సబ్‌ డివిజన్‌లో 1.32 ఎకరాలు రూ.23వేలకు మామిడి లక్ష్మి, 34సబ్‌ డివిజన్‌లో 3.45 ఎకరాలు రూ.60వేలకు తాడ్డి రామచంద్రరావు, 45 సబ్‌ డివిజన్‌లో 6.45 ఎకరాలు రూ.1.70 లక్షలకు ఏనుగుల ఆనందరావు, 49 సబ్‌ డివిజన్‌లో 1.47 ఎకరాలు రూ.24వేలకు కెల్ల పాపారావు, 50 సబ్‌ డివిజన్‌లో 1.85 ఎకరాలు రూ.45వేలకు బూడి హరికృష్ణ, 51 సబ్‌ డివిజన్‌లో 88సెంట్లు రూ.17వేలకు కొట్టాడ అప్పలరాము, 52 సబ్‌ డివిజన్‌లో 1.76 ఎకరాలు రూ.38వేలకు బెల్లాన రమణ, 91 సబ్‌ డివిజన్‌లో 3.68 ఎకరాలు రూ.65వేలకు లోగిస అప్పలనాయుడు, 98 సబ్‌ డివిజన్‌లో 1.67 ఎకరాలు రూ.11వేలకు బూడి వీరినాయుడు వేలంపాటలో దక్కించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేలం పాటలో రైతులు పోటాపోటీగా పాల్గొన్నారు. గతంలో వేలం పాట ద్వారా వేలల్లో వచ్చిన ఆదాయం ఈ సారి రూ.లక్షల్లో దేవస్థా నానికి రానుంది. సీఐ ఎస్‌.సన్యాసినాయుడు పర్యవేక్షణలో గజపతిన గరం, బొండపల్లి ఎస్‌ఐలు కిరణ్‌కుమార్‌ నాయుడు, మహేష్‌తో పాటు పోలీస్‌ సిబ్బంది సమక్షంలో వేలంపాట జరిగింది. కార్యక్రమంలో ఈవోలు జగదీశ్వరి, వంశీలక్ష్మి, జూనియర్‌ అసిస్టెంట్‌ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 12:36 AM