గడ్డిమందు తాగి.. After consuming weedkiller...
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:26 AM
గడ్డిమందు తాగి ఆత్మ హత్యా యత్నానికి పాల్పడిన ఓ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.
వంగర, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): గడ్డిమందు తాగి ఆత్మ హత్యా యత్నానికి పాల్పడిన ఓ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని శివ్వాం గ్రామానికి చెందిన అంబళ్ల వెంకటనాయుడు(35) అనే యువకుడు ఈనెల 11వ తేదీన అర్ధరాత్రి సమయంలో గడ్డిమందు తాగి ఆత్మహత్యా యత్నా నికి పాల్పడ్డాడు. ఇది గమనించిన భార్య నిర్మల.. తమ బం ధువులకు చెప్పి గోప్యంగా రాత్రి శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. వెంకటనాయుడు అక్కడ పదిహేను రోజులపాటు చికిత్సపొందుతూ మంగళవా రం మధ్యాహ్నం తుది శ్వాస విడిచాడు. మృతుడికి భార్యతో పాటు పాప, బాబు ఉన్నారు. ఈయన గత కొన్నిరోజులుగా అతిగా మద్యం తాగి, ఇంటికి కూడా చేర కుండా బయట తిరిగేవాడని, మతిస్థిమితం లేక ఈ చర్యలకు పాల్పడి ఉంటాడని గ్రామస్థులు చెబుతున్నారు. మృతుడి భార్య నిర్మల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ షేక్‌శంకర్ తెలిపారు.