Share News

అటవీ ఉత్పత్తులకు అడ్వాన్స్‌ టెండర్లు

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:53 PM

స్థానిక ఐటీడీఏ కార్యాల యంలో గురువారం అటవీ ఉత్పత్తులకు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ అడ్వాన్స్‌ టెండర్ల ప్రక్రియ నిర్వహించారు.

అటవీ ఉత్పత్తులకు అడ్వాన్స్‌ టెండర్లు
వ్యాపారులతో మాట్లాడుతున్న ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌

సీతంపేట రూరల్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):స్థానిక ఐటీడీఏ కార్యాల యంలో గురువారం అటవీ ఉత్పత్తులకు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ అడ్వాన్స్‌ టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. గిరిజన ఉత్పత్తులను జీసీసీ ప్రకటించిన మద్దతు ధర ప్రాప్తికి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పీవో సూచించారు. ఒక్కో వ్యాపారస్థుడికి ఇచ్చిన టార్గెట్‌ల ప్రకారం కొండచీపుర్లను కొనుగోలు చేయాలన్నారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ ఐటీడీఏ, జీసీసీ ఆదేశాల మేరకు అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి మైదాన ప్రాంతాలకు తరలిస్తుంటే అటవీశాఖ సిబ్బంది అడ్డుకుంటున్నారని పీవో దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై పీవో మాట్లాడుతూ ఫారెస్ట్‌ అధికారులతో మాట్లాడతాన న్నారు.అడ్వాన్స్‌ టెండర్‌ల ప్రక్రియలో జీసీసీ డీఎం కృష్ణారావు, బీఎం నర్సింహులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 11:53 PM