Share News

జోరుగా కల్తీ కల్లు విక్రయాలు

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:31 PM

గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీలో కల్తీ జీలుగు కల్లు అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి.

   జోరుగా కల్తీ కల్లు విక్రయాలు
కురుపాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు(ఫైల్‌)

- ప్రజల ప్రాణాలతో చెలగాటం

- ఈ నెల 17న గుమ్మలక్ష్మీపురం మండలంలోని గిరిశిఖర గ్రామం వనకాబడిలో జీలుగు కల్లు తాగి 15 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. కల్తీ జీలుగు కల్లు తాగడమే ఈ పరిస్థితికి కారణమని వైద్యులు చెప్పారు.

గుమ్మలక్ష్మీపురం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీలో కల్తీ జీలుగు కల్లు అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వ్యాపారులు కల్లులో ఇతర పదార్ధాలను కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ కల్లును తాగుతున్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం గిరిజన ప్రాంతాల్లో జీలుగు చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ చెట్ల నుంచి గిరిజనులు ప్రతిరోజూ జీలుగు కల్లును సేకరిస్తుంటారు. వారి నుంచి ఈ కల్లును వ్యాపారులు కొనుగోలు చేసి విక్రయాలు చేపడుతుంటారు. జీలుగు కల్లుతో ఆరోగ్యం బాగుంటుందని గిరిజన ప్రాంతాల నుంచే కాకుండా పల్లపు ప్రాంతాల నుంచి కూడా పలువురు వచ్చి తాగుతుంటారు. మద్యం కంటే రేటు తక్కువగా ఉండడం కారణంగా కల్లు తాగేందుకు మందుబాబులు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, కొందరు వ్యాపారులు జీలుగు కల్లును కల్తీ చేస్తున్నారు. దీంతో వాటిని తాగుతున్న వారు అస్వస్థతకు గురవుతున్నారు. జీలుగు కల్లు కల్తీ కారణంగా గతంలో మరణాలు కూడా సంభవించాయి. లైసెన్స్‌ లేకుండా జీలుగు కల్లు అమ్మడం నేరం. అయినా కొందరు వ్యాపారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - Jan 19 , 2026 | 11:31 PM