‘ఆరోగ్య జీవనశైలిని అలవాటు చేసుకోండి’
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:22 AM
ప్రతీ ఒక్కరు ఆరోగ్యకర జీవనశైలిని అలవాటు చేసుకోవాలని డీఎంహెచ్‌వో విజయలక్ష్మి సూచించారు.
పార్వతీపురం రూరల్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరు ఆరోగ్యకర జీవనశైలిని అలవాటు చేసుకోవాలని డీఎంహెచ్‌వో విజయలక్ష్మి సూచించారు. ఆదివారం వెంకంపేట పంచాయతీ పరిధిలోని జిలా ్లవైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవనశైలి, విద్యుత్ ఆదా, నీటి పొదుపు, మంచి ఆహారం తీసుకోవడం, ప్లాస్టిక్ వినియోగం, ఈ వ్యర్ధ్యాలు, ఆహార వృఽథాను తగ్గించడం వంటి అంశాలపై ఈ నెల 7 వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, ప్రోగ్రాం అధికారులు ఎం.రవికుమార్‌రెడ్డి, ఏక్‌నాథ్ తదితరులున్నారు.