Share News

ఎన్నికల కోడ్‌ అనుసరించి నడుచుకోండి

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:08 AM

నిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల కోడ్‌ను అనుసరించి నడుచుకోవాలని, ఎటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా సిబ్బంది ముందస్తు సమాచారం ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు అందజేయాలని బొబ్బిలి డీఎస్పీ ఆర్‌.గోవిందరావు ఆదేశించారు.

ఎన్నికల కోడ్‌ అనుసరించి నడుచుకోండి
పోలీసుస్టేషన్‌లో రికార్డును పరిశీలిస్తున్న డీఎస్పీ గోవిందరావు :

దత్తిరాజేరు, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల కోడ్‌ను అనుసరించి నడుచుకోవాలని, ఎటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా సిబ్బంది ముందస్తు సమాచారం ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు అందజేయాలని బొబ్బిలి డీఎస్పీ ఆర్‌.గోవిందరావు ఆదేశించారు. బుధవారం పెదమానాపురం పోలీసుస్టేషన్‌ను స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా గోవిందరావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుస్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో పెదమానాపురం పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐ జి.కళాధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2026 | 12:08 AM