Share News

సంకిలిలో భూసర్వేకు అదనపు బృందాలు

ABN , Publish Date - Sep 08 , 2026 | 11:57 PM

మండలం లోని సంకిలిలో భూసర్వే నత్తనడక సాగుతోందని గ్రామస్థులు చేపట్టిన నిరసనపై తహసీల్దార్‌ ఈశ్వరరావు స్పందించారు.

సంకిలిలో భూసర్వేకు అదనపు బృందాలు

  • రైతుల నిరసనపై స్పందించిన తహసీల్దార్‌

రేగిడి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): మండలం లోని సంకిలిలో భూసర్వే నత్తనడక సాగుతోందని గ్రామస్థులు చేపట్టిన నిరసనపై తహసీల్దార్‌ ఈశ్వరరావు స్పందించారు. మంగళవారం సంకిలి రెవెన్యూలో నిర్వహిస్తున్న సమగ్ర భూసర్వే తీరును ఆయన ఆరా తీశారు. స్థానిక సచివాలయంలో రైతులతో తహసీల్దార్‌తో పాటు ఆర్‌ఐ గిరి సమావేశం నిర్వహించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. గ్రౌండ్‌ ట్రూతింగ్‌ ప్రక్రియలో లోపాలు ఉన్నట్టు గుర్తించారు. రైతుల వద్ద భూహక్కు ఆధారాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌.. వీఆర్వో దుర్గారావు, సర్వే సిబ్బందిని ఆదేశించారు. పెద్ద రెవెన్యూ గ్రామం కావటంతో ప్రస్తుతం ఉన్న సర్వే టీమ్‌తో పాటు మరో రెండు బృందాలను అదనంగా ఏర్పాటుచేసి, సర్వే ప్రక్రియను సకాలంలో పూర్తిచేస్తామని ఆయన స్థానిక రైతులకు హామీఇచ్చారు. ఈ సమస్య సర్వే లాండ్స్‌ ఏడీ దృష్టికి తీసుకు వెళ్లినట్టు తహసీల్దార్‌ తెలిపారు.

Updated Date - Sep 08 , 2026 | 11:57 PM