Activists are the strength of TDP కార్యకర్తలే టీడీపీకి బలం
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:06 AM
Activists are the strength of TDP తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసే కార్యకర్తలే బలమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినం పురస్కరించుకొని ఆదివారం గజపతినగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
కార్యకర్తలే టీడీపీకి బలం
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గజపతినగరంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ
గజపతినగరం మార్చి29(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసే కార్యకర్తలే బలమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినం పురస్కరించుకొని ఆదివారం గజపతినగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ తెలుగుప్రజల గుండె చప్పుడని అన్నారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లుగా భావించి ప్రతి ఒక్కరికీ కూడు,గూడు,గుడ్డ సాధనకే పార్టీని స్థాపించడమే కాకుండా తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనదేనన్నారు. తెలుగువారి సత్తా ఏంటో అప్పట్లోనే ఆయన ఢిల్లీకి చూపారని గుర్తుచేశారు. పార్టీ 44 వసంతాల ప్రస్థానంలో ఎత్తిన జెండాను దించకుండా టీడీపీకి కాపుకాసిన కార్యకర్తలది కీలక పాత్రగా అభివర్ణించారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలూ పని చేస్తున్నారన్నారు. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా 2047 విజన్ తీసుకొచ్చారని చెప్పారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను శతశాతం నెరవేర్చారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మక్కువ శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, పార్టీ సీనియర్ నాయకులు కొండపల్లి కొండలరావు, గజపతినగరం,దత్తిరాజేరు బొండపల్లి,గంట్యాడ,జామి మండల టీడీపీ అధ్యక్షులు గంట్యాడశ్రీదేవి, చప్పా చంద్రశేఖర్, రాపాక అచ్చుంనాయుడు ,కొండపల్లి భాస్కరనాయుడు, స్వామినాయుడు, పీఏసీఎస్ చైర్మన్ లెంక బంగారునాయుడు, ఆండ్ర ప్రాజెక్టు చైర్మన్ కోడి సతీష్ తదితరులు పాల్గొన్నారు.