Share News

కార్యకర్తలే పార్టీకి పునాది

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:51 AM

కార్యకర్తలే పార్టీకి పునాది అని, వారి రక్షణ పార్టీ బాధ్యత అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

కార్యకర్తలే పార్టీకి పునాది
మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): కార్యకర్తలే పార్టీకి పునాది అని, వారి రక్షణ పార్టీ బాధ్యత అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో 29 వార్డులోని టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పార్టీని వార్డు స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని సూచించారు. పెద్దల అనుభవం, యువత ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు. ప్రజల్లో నిత్యం ఉండే వారే నిజమైన నాయకులని వ్యాఖ్యానించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, కేతిరెడ్డి చంద్రశేఖర్‌, పప్పల మోహనరావు, కారేపు చంద్రరావు, కిలారి రవికుమార్‌, వైదేసి, వాడాడ శోభారాణి తోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 26 , 2026 | 12:51 AM