కార్యకర్తలే పార్టీకి పునాది
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:37 AM
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పునాది అని మంత్రి గుమ్మిడి సం ధ్యారాణి అన్నారు.
మంత్రి సంధ్యారాణి
మెంటాడ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పునాది అని మంత్రి గుమ్మిడి సం ధ్యారాణి అన్నారు. శుక్రవారం కేబీ వలసలో టీడీపీ మండల అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు అధ్యక్షత న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి ఆమె హాజర య్యారు. కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పారు. 11 సీట్లకు పరిమితం చేసినా లెవెన్ రెడ్డికి బుద్ధి రాలేదన్నారు. వచ్చే స్థానికల సంస్థల ఎన్నికల్లో వైసీపీని శాశ్వతంగా ఇంటికి సాగనంపాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈసందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.