Share News

రేషన్‌ పక్కదారి పడితే చర్యలు

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:31 PM

రేషన్‌ సరుకులను లబ్ధిదారులకు సక్రమంగా అందించాలని, వాటిని పక్కదారి పట్టిస్తే డీలర్లపై చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.

రేషన్‌ పక్కదారి పడితే చర్యలు
శివ్వాం రేషన్‌ డిపోలో బియ్యం నిల్వలను పరిశీలిస్తున్న జేసీ

- జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి

గరుగుబిల్లి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ సరుకులను లబ్ధిదారులకు సక్రమంగా అందించాలని, వాటిని పక్కదారి పట్టిస్తే డీలర్లపై చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం మండలంలోని గొట్టివలస, శివ్వాం, కొత్తూరు రేషన్‌ డిపోలీను ఆయన తనిఖీ చేశారు. దుకాణాల పరిధిలోని సరుకులు నిల్వలు, బయోమెట్రిక్‌, స్టాక్‌ రిజిష్టర్లను పరిశీలించారు. బియ్యంతో పాటు నిత్యావసర వస్తువుల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. కార్డుదారులకు పంపిణీ చేసే రేషన్‌లో పారదర్శకతను విధిగా పాటించాలన్నారు. తూకంలో తేడాలు ఉండకూడదన్నారు. రేషన్‌ డిపోలను మండల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు. ఈపాస్‌ యంత్రాల పనితీరుతో పాటు రికార్డుల నిర్వహణను ఎప్పకటిప్పుడు పూర్తి చేయాలన్నారు. సరుకుల పంపిణీలో ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే డీలర్ల తొలగింపు తప్పదని అన్నారు. ఆయన వెంట మండల తహసీల్దార్‌ పి.బాల, సివిల్‌ సప్లయ్‌ డీటీ ఎస్‌.మారుతీరావు, తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 11:31 PM