బయోమెడికల్ వ్యర్థాలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:48 PM
ఫఆస్పత్రులకు కలెక్టర్ రామసుందర్ రెడ్డి హెచ్చరిక
విజయనగరం కలెక్టరేట్, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య ఆస్పత్రులు బయోమెడికల్ వ్యర్థాలు నిర్వహణ నిబంధనలను పాటించాలని, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహిం చినా సంబంధిత ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం విజయనగరంలో కాలుష్య నియంత్రణ మండలి, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఆసుపత్రి వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలకమైన ప్రక్రియ అని ప్రజారోగ్యానికి భంగం కలగకుండా శాస్ర్తీయపద్ధతిలో నిర్ణీత సమయంలోగా తరలించాలన్నారు. ప్రతి ఆసుప త్రిలో రెడ్, ఎల్ల్డో, బ్లూ, వైట్ రంగులు కోడింగ్ బ్యాగులను ఉపయోగించి, ఇంజక్షన్ సూదులు, ప్రతి గ్లౌజ్, శరీరవ్యర్ధాలను తప్పనిసరిగా వేరు చేయా లని సూచించారు. జిల్లాలోని 496 ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పశుసంవర్ధక ఆసుపత్రుల నుం చి కూడా క్రమం తప్పకుండా వ్యర్థాల సేకరణజరగాలని ఆదేశించారు. సేకరిం చిన వ్యర్థాలను 48 గంటల గడువులోగా తరలించాలని, ఎక్కడా బయట కనిపించకూడదని తెలిపారు. ప్రతి ఆసు పత్రి, క్లినిక్ ల్యాబ్ తమ వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాల వివరాలను బయో మెడికల్ వేస్టు మేనేజ్‌మెంట్ యాప్‌లో ప్రతిరోజు నమోదు చేయాలని ఆదేశించారు. డేటా ఎంట్రీ చేయని సంస్థలపై చర్యలు తీసుకోవాలని, వెంటనే నోటీసులు జారీచేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికా రులను ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి బయోమెడికల్ వ్యర్థాలను సైతం సేకరించి, సరైన పద్ధతిలో వాటిని తరలించాలని కమిషనర్లకు సూచించా రు. వ్యర్థాలకు బయటపడేసే ఆసుపత్రులపై నిఘాపెట్టాలన్నారు. కార్య క్రమంలోని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, జిల్లా వైద్యాధికారి జీవనరాణి పాల్గొన్నారు.