నిర్వహణలో లోపాలు ఉంటే చర్యలు
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:12 AM
ఉపాధి హామీ పనుల్లో లోపాలు ఉంటే చర్యలు తప్పవని కేంద్ర జలశక్తి శాఖ పరిశీలకుడు సుగుణాకరరావు హెచ్చరించారు.
గరుగుబిల్లి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పనుల్లో లోపాలు ఉంటే చర్యలు తప్పవని కేంద్ర జలశక్తి శాఖ పరిశీలకుడు సుగుణాకరరావు హెచ్చరించారు. గురువారం జల సంచాయ్, జల భగీరఽథ కార్యక్రమంలో భాగంగా జల సంరక్షణ పనులను పరిశీలించారు. గరుగుబిల్లి, బలిజిపేట, జియ్యమ్మవలస మండలాల పరిధిలో నిర్వహించిన పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సుగుణాకరరావు మాట్లాడుతూ నీటి నిల్వలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం ఏర్పాటు చేసిందన్నారు. ఈ పథకంలో చెరువులు అభివృద్ధితో పాటు సోప్ ఫిట్లుతో పాటు పలు రకాల పనులను నిర్వహణ చేసుకోవచ్చునన్నారు. మండలాల పరిధిలో గతంలో జల సంచాయ్, జల భగీరధ 2.0లో పలు రకాల పనులను అప్‌లోడ్ చేశారన్నారు. పొందుపర్చిన పనులను, క్షేత్రస్థాయిలోని పనులకు తేడాలను పరిశీలన చేస్తున్నామన్నారు. మండలానికి సంబంధించి పెద్దూరు, చిలకాం, రావివలస, ఉద్దవోలులో నిర్వహించిన పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశీలనలో ఏపీడీ పి.త్రివిక్రమరావు, ఏపీవో ఈశ్వరమ్మ, జేఈ దాసరి తేజేశ్వరరావు, టెక్నికల్ అసిస్టెంట్లు హరికృష్ణ, ఉమామహేశ్వరి, నిర్మల, దిలీప్‌కుమార్, తదితరులు ఉన్నారు.