విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:21 AM
విధి నిర్వహణలో ఉద్యోగులు నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి హెచ్చరించారు.
‘సర్’ అభ్యంతరాలను పరిష్కరించండి: కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి
రాజాం రూరల్, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఉద్యోగులు నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. సిబ్బంది సకాలంలో విధులకు హాజరుకావాలని, ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టంచేశారు. బుధవారం మండలంలోని కంచరాం-1 సచివాల యంలో రికార్డులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ప్రజలకు అందజేస్తున్న ప్రభుత్వ సేవల వివరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. కాగా ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా(సర్) సవరణ ప్రక్రియలో వచ్చిన అభ్యంతరాలు, అప్పిళ్లను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి రాజాం తహసీల్దార్, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు.కార్యాలయంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి, తహసీల్దార్ రాజశేఖర్, కమిషనర్ రామచంద్రరావు పాల్గొన్నారు.