Actions for filling up posts in KGBV కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి చర్యలు
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:08 AM
Actions for filling up posts in KGBV జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 73 బోధనేతర పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని సమగ్ర శిక్ష ఏపీసీ ఎ.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను నేరుగా కార్యాలయంలో సమర్పించాలన్నారు.
కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి చర్యలు
73 బోధనేతర సిబ్బంది నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
ఈ నెల 20 వరకూ గడువు
అదనపు పథకం సమన్వయకర్త రామారావు
విజయనగరం కలెక్టరేట్, జనవరి 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 73 బోధనేతర పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని సమగ్ర శిక్ష ఏపీసీ ఎ.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను నేరుగా కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈనెల 6 నుంచి 20 తేదీ వరకూ దరఖాస్తులను తీసుకుంటామని, పని దినములలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. టైపు-3 కేజీబీవీల్లో ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ 10 పోస్టులు, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లు 12 పోస్టులు, ఏఎన్‌ఎంలు 7, అటెండర్‌లు 4, అసిస్టెంట్ కుక్ ఐదుగురు, డే నైట్ వాచ్ ఉమెన్ ఒకరు, స్కావెంజర్ ఏడు పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. టైపు-4 కేజీబీవీల్లో పార్ట్ టైమ్ టీచర్లు ఏడుగురు, వార్డెన్‌లు 4, కుక్‌లు 11, చౌకిదారులు 5 భర్తీ చేయనున్నామని, కుక్ , స్వీపర్ , వాచ్ ఉమెన్ , అటెండర్ పోస్టులకు ప్రత్యేక విద్యార్హతలు అవసరం లేదని పేర్కొన్నారు. ఇతర సాంకేతిక పోస్టుల పూర్తి వివరాల కోసం (విజయనగరం.ఏపి.జివోవి.ఇన్)వెబ్‌సైట్‌ను చూడవచ్చని తెలిపారు. వయసు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నియామకాలు ఇంటర్వ్యూలు ద్వారా జరుగనున్నాయని పేర్కొన్నారు. ఏ మండలంలోని ఖాళీలు ఉన్నాయో? ఆ స్థానిక మండలానికి చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఇతర వివరాలకు విజయనగరం జిల్లా అధికార వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలియజేశారు.
-----------