Share News

ుద్యం అక్రమంగా రవాణా చేస్తే చర్యలు

ABN , Publish Date - Nov 21 , 2026 | 11:56 PM

పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని గ్రామాల్లో అక్రమంగా మద్యం రవాణా చేస్తే చర్యలు తప్పవని సీతానగరం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.పద్మా వతి తెలిపారు.

 ుద్యం అక్రమంగా రవాణా చేస్తే చర్యలు
మద్యంకేసుల్లో పట్టుబడిన వారికి తహసీల్దార్‌ ఎదుట హాజరుపరిచిన దృశ్యం:

గరుగుబిల్లి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని గ్రామాల్లో అక్రమంగా మద్యం రవాణా చేస్తే చర్యలు తప్పవని సీతానగరం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.పద్మా వతి తెలిపారు. శనివారం గరుగుబిల్లి తహసీల్దార్‌కార్యాలయంలో తహ సీల్దార్‌ పి.బాల ఎదుట అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన ఐదుగురిని హాజరుపరిచారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఏడాదిపాటు జైలు శిక్ష, లక్ష రూపాయలు జరి మానా తప్పదన్నారు. దుకాణ యజమానులు నిబంధనలు పాటించా లని కోరారు. గ్రామాల్లో గొలుసుదుకాణాలు నిర్వహించినా, ఇతర నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌, సారా అమ్మకాలు నిర్వహిస్తే చర్యలు తప్ప వని హెచ్చరించారు. ఎక్సైజ్‌స్టేషన్‌ కార్యాలయం పరిధిలోని సీతానగరం, బలిజిపేట, గరుగుబిల్లి ప్రాంతాల్లో నిఘా ఏర్పాటుచేశామని తెలిపారు.

Updated Date - Nov 21 , 2026 | 11:56 PM