అదనపు చార్జీలు వసూలు చేస్తే చర్యలు
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:06 AM
సంక్రాంతి సమయంలో ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు అదనంగా చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పాలకొండ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ టి.వేణుగోపాలరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు హెచ్చరించారు.
పాలకొండ, జనవరి13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సమయంలో ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు అదనంగా చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పాలకొండ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ టి.వేణుగోపాలరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం వారు పట్టణంలో పలు ప్రైవేట్ బస్సులను తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు మేరకు బస్సు చార్జీలను వసూలు చేయాలన్నారు ఆర్టీసీ బస్సుల తరహాలో 50 శాతం వరకు అదనంగా వసూలు చేయవచ్చునన్నారు. అంతకుమించి వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. బస్సులపైన లగేజీలు వేయరాదని స్పష్టం చేశారు.