Share News

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:09 AM

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు హెచ్చరించారు.

 ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
సంతకవిటి: కొండగూడెంలో మాట్లాడుతున్న రాఘవులు:

సంతకవిటి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. మంగళవారం కొండగూడెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపఽథ్యంలో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, రాజాం రూరల్‌ సీఐ హెచ్‌.ఉపేంద్రరావు ఎస్‌ఐ పి.నీలావతి ఆఽధ్వర్యంలో గ్రామస్థులకు పోలీసులు ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎవరూ గొడవలు, ఘర్షణలకు పాల్పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రతిఒక్కరూ సంయమనం పాటిస్తూ, చట్టాన్ని గౌరవించాలని తెలిపారు. గ్రామం లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

శాంతిభద్రలకు విఘాతం కలిగే చర్యలు: సీఐ

చీపురుపల్లి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఎన్నికలను ఆసరాగా చేసుకొని గ్రామా ల్లో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ జి.శంకరరావు హెచ్చరించారు. మం డలంలోని పేరిపి, అలజంగి గ్రామాల్లో మంగళవారం జరిగిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. శాంతిభద్రలకు విఘాతం కలిగే విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎటువంటి అల్లర్లు, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కోరా రు. కార్యక్రమంలో ఎస్‌ఐ పి.ఉమావెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రం పరిశీలన

రేగిడి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని లక్ష్మీపురం పోలింగ్‌ కేంద్రాన్ని ఎస్‌ఐ బాలకృష్ణ మంగళవారం పరిశీలించారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో ఈకేంద్రంలో మౌలికవసతులు, కేంద్రం స్థితిగతులను ఆయన సిబ్బందిని అడిగితెలుసుకున్నారు.

Updated Date - Nov 18 , 2026 | 12:09 AM