‘ఎన్నికల్లో వివాదాలు సృష్టిస్తే చర్యలు’
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:03 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని బొబ్బిలి డీఎస్పీ రాకోటి గోవిందరావు హెచ్చరించారు.
రామభద్రపురం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని బొబ్బిలి డీఎస్పీ రాకోటి గోవిందరావు హెచ్చరించారు. ఆదివారం ఆరికతోట, తారాపురం, కొండకెంగువ, రామభద్రపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో జరిపేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎటువంటి వివాదాలకు పాల్పడినా వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే గ్రామాల్లో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా ఐకమత్యంతో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే సమస్యాత్మక గ్రామాలను పోలీసులు దత్తత తీసుకొని ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా చూడాలని ఆదేశించామన్నారు. ఆయనతో పాటు ఎస్ఐ వి.జ్ఞానప్రసాద్ ఉన్నారు.