Share News

విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:27 AM

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఏపీడీ రమామణి హెచ్చరించారు. శనివారం బాడంగిలో విబిజి రామ్‌జీ పథకం సిబ్బందితో ఏపీడీ సమీక్షించారు.

 విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మాట్లాడుతున్న ఏపీడీ రమామణి:

బాడంగి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఏపీడీ రమామణి హెచ్చరించారు. శనివారం బాడంగిలో విబిజి రామ్‌జీ పథకం సిబ్బందితో ఏపీడీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫాంపాండ్స్‌, ఫిష్‌ఫాండ్స్‌, సోక్‌ఫిట్స్‌, స్ర్టెంచ్‌ వర్క్‌, హార్టికల్చర్‌ పనులను ప్రతి పంచాయతీలో చేపట్టాలన్నారు. ప్రతి కుటుంబానికి 125 పని దినాలు కల్పించడానికి ఇప్పటి నుంచి వర్కు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మండలంలో 62 కాటిల్‌ షెడ్స్‌ మంజూరు కాగా ఈ నెలలో పూర్తిచేయాలని తెలిపారు. జల సంరక్షణ పనులను ప్రాధాన్యత ఇవ్వాలని, పనుల్లోనాణ్యత పెంచాలని కోరారు. అనంతరం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో హైడేన్సిటీ ప్లాంటేషన్‌, కోడూరులో ఫిష్‌ఫాండ్స్‌ పరిశీలించారు. సమావేశంలో ఏపీవో కె.సాయిరాం, జేఈ ఎ.హరినారాయణ, టీఏ పి.శంకరరావు, ఆర్‌.రామారావు, ఎఫ్‌ఏ పాపయ్య పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 12:27 AM