Share News

Farmers రైతులను ఇబ్బంది పెడితే చర్యలు

ABN , Publish Date - Apr 22 , 2026 | 11:50 PM

Action Will Be Taken Against Harassment of Farmers ఎరువుల పంపిణీ విషయంలో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎరువుల కంపెనీల ప్రతినిధులు, హోల్‌సేల్‌ డీలర్లు, మండల వ్యవసాయ శాఖాధికా రులతో సమీక్షించారు.

  Farmers రైతులను ఇబ్బంది పెడితే చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ

పార్వతీపురం, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ఎరువుల పంపిణీ విషయంలో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎరువుల కంపెనీల ప్రతినిధులు, హోల్‌సేల్‌ డీలర్లు, మండల వ్యవసాయ శాఖాధికా రులతో సమీక్షించారు. రైతులపై రూపాయి కూడా అదనపు భారం ఉండరాదన్నారు. డీలర్లు, విక్రయదారులెవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే సహించబోమని స్పష్టం చేశారు. జిల్లాకు వచ్చే ఎరువుల సమాచారాన్ని కనీసం నాలుగు రోజులు ముందే తమకు తెలియజేయాలని ఆదేశిం చారు. స్టాక్‌ పాయింట్‌ నుంచి రిటైలర్లకు వెళ్లే ప్రతి బస్తా వివరాలు అధికారుల వద్ద ఉండా లన్నారు. రైతులకు అవసరం లేని ఇతర ఉత్పత్తులను అంటగట్టరదన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, వంద శాతం పారదర్శకంగా పంపిణీ చేయాలని వ్యవసాయాధికారులకు సూచించారు. రైతులు పర్యావరణహితమైన నానో యూరియా, సేంద్రియ ఎరువుల వినియోగించేలా చూడాలన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2026 | 11:50 PM