‘upadhi’ Staff” ‘ఉపాధి’ సిబ్బందిపై వేటు
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:36 PM
“Action Taken Against ‘upadhi’ Staff” సీతంపేట, భామిని మండలాల్లో చేపట్టిన ఉపాధి పనుల్లో లోపాలు బహిర్గతమయ్యాయి. దీంతో సంబంధిత సిబ్బందిపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. సీతంపేట ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యాలయంలో శుక్రవారం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డ్వామా పీడీ రామచంద్రరావు ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు.
టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెన్షన్
21మందికి షోకాజ్ నోటీసులు జారీకి ఆదేశాలు
ముగ్గురికి బదిలీ
సీతంపేట రూరల్,ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): సీతంపేట, భామిని మండలాల్లో చేపట్టిన ఉపాధి పనుల్లో లోపాలు బహిర్గతమయ్యాయి. దీంతో సంబంధిత సిబ్బందిపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. సీతంపేట ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యాలయంలో శుక్రవారం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డ్వామా పీడీ రామచంద్రరావు ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో 2025-26లో చేపట్టిన ఉపాధి పనుల్లో వెలుగు చూసిన అక్రమాలపై విచారణ చేపట్టారు. సామరెల్లి పంచాయతీ పరిధిలో ఉపాధి పనులు చూపించని కారణంగా సామరెల్లి ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్.రమేష్‌ను సస్పెండ్ చేయాలని ఎంపీడీవో మిశ్రోను వారు ఆదేశించారు. లక్ష్యాలు పూర్తిచేయని 21మంది టెక్నికల్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీచేయాలన్నారు. మరో ముగ్గురు సీనియర్ టీఏలను బదిలీ చేయాలన్నారు.
- స్థానిక వైటీసీలో ఎన్యూమరేటర్, సూపర్‌వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఇన్‌చార్జి పీవో పరిశీలించారు. ప్రతీ ఇంటికి వెళ్లి జనగణన సర్వే పక్కాగా చేయాలని ఆదేశించారు. ఎటువంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. వచ్చేనెల 1 నుంచి జనగణన సర్వే ప్రారంభం అవుతుందని, అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.
భామినిలో
భామిని, ఏప్రిల్10(ఆంధ్రజ్యోతి): భామిని ఎంపీడీవో కార్యాలయంలోనూ సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో 2024-25లో సుమారు రూ.27.92 కోట్లతో చేపట్టిన ఉపాధి పనులపై అధికారులు, ప్రజా పతినిధుల సమక్షంలో పంచాయతీల వారీగా బహిరంగ చర్చ జరిగింది. వేతనదారుల సంఖ్య పెంచని కారణంగా బొడ్డగూడ ఫీల్డ్ అసిస్టెంట్లు బిడ్డిక రమేష్, బి.మధు, ఎస్.సుమన్‌తో పాటు భామిని సెక్టార్‌కు చెందిన టెక్నికల్ అసిస్టెంట్ భీమారావును పీడీ సస్పెండ్ చేశారు. బొడ్డగూడ పంచాయతీ పరిధిలో 804 వేతన దారులు ఉంటే ఇద్దరే పనికి రావడం ఏమిటని ప్రశ్నించారు. బత్తిలి, భామినిలో అదే పరిస్థితి నెలకొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా మండల ఉపాధి సిబ్బంది నుంచి రూ.15.70 రికవరీ చేస్తున్నట్టు వెల్లడించారు.