KGBV Staff కేజీబీవీ సిబ్బందిపై వేటు
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:43 AM
Action Taken Against KGBV Staff సాలూరు మండలం కరాసువలస కేజీబీవీ ప్రిన్సిపాల్‌తో సహా మరో నలుగురు సిబ్బందిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు.
పార్వతీపురం, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): సాలూరు మండలం కరాసువలస కేజీబీవీ ప్రిన్సిపాల్‌తో సహా మరో నలుగురు సిబ్బందిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ప్రిన్సిపల్ జి.ప్రశాంతితో పాటు హెడ్ కుక్ వి.హేమ, అసిస్టెంట్ కుక్స్ జి.భవాని, సీహెచ్ రాజేశ్వరి, జి.సత్యవతిలను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ ఇన్‌చార్జి పీవో రాజ్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది ఏప్రిల్ 9న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కరాసువలస కేజీబీవీని సందర్శించారు. ఈ సమయంలో విద్యార్థినులకు సరిపడా అన్నం, ఎగ్ కర్రీ లేకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు పూర్తిస్థాయిలో ఆహారం పెట్టకపోవడం, వంటశాల పరిశుభ్రంగా లేకపోవడంపై మండిపడ్డారు. దీనిపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో వెంటనే ప్రిన్సిపాల్‌తో సహా వంట సిబ్బందికి గత ఏడాది ఏప్రిల్ 10న షాకోజ్ నోటీసు జారీ చేశారు. ఆ తర్వాత వారిని సస్పెండ్ చేశారు. విచారణ అనంతరం గత ఏడాది ఏప్రిల్ 19న ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. దానిని పరిశీలించిన అనంతరం కేజీబీవీ సిబ్బందిపై వేటు వేస్తున్నట్లు ఈ నెల 17న కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై డీఈవో బ్రహ్మాజీర ావును వివరణ కోరగా.. ‘ప్రస్తుతం నేను సెలవులో ఉన్నా. కరాసువలస కేజీబీవీ ప్రిన్సిపాల్‌తో పాటు మరో నలుగురు వంట సిబ్బంది తొలగింపు విషయం వాస్తవమే.’ అని తెలిపారు.