Share News

పాలు కల్తీ అయితే చర్యలు తప్పవు

ABN , Publish Date - Feb 26 , 2026 | 11:56 PM

పాలు కల్తీ అయితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఆహార భద్రతా అధికారి ఎస్‌కే నాగుల్‌ మీరా హెచ్చరించారు.

పాలు కల్తీ అయితే చర్యలు తప్పవు

  • జిల్లా ఆహార భద్రతా అధికారి నాగుల్‌ మీరా

భోగాపురం, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): పాలు కల్తీ అయితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఆహార భద్రతా అధికారి ఎస్‌కే నాగుల్‌ మీరా హెచ్చరించారు. భోగాపురం గ్రామంలో ని పాల ఉత్పత్తిదారుల సంఘం కేంద్రంలో ఆయన గురువారం తనిఖీలు నిర్వహించా రు. కొన్ని పాల నమూనాలను సేరించారు. జిల్లాలో అన్ని పాల ఉత్పత్తి కేంద్రాలను తని ఖీ చేస్తున్నామని, నమూనాలను సేకరించి ప రీక్షల నిమిత్తం హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపి స్తున్నామని చెప్పారు. కల్తీ నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకేంద్రం వేతన కార్యదర్శి పి.రామకృష్ణ, సహాయకుడు బాబూరావు, పాల రైతులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 11:56 PM