పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:16 AM
పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ బి.కాంతారావు హెచ్చరించారు.
స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ కాంతారావు
గురువాం కేజీబీవీలో మెనూపై అంసతృప్తి
రాజాం రూరల్, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ బి.కాంతారావు హెచ్చరించారు. మండల పరిధి లోని గురవాం కేజీబీవీని గురువారం సాయంత్రం ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో నెలకొన్న పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ కచ్చితంగా అమలు చేయాలని ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ఇక్కడ నెలకొన్న పరిస్థితులు, అసౌకర్యాలు, విద్యార్థుల ఇబ్బందులపై స్టేట్ ఫుడ్‌కమిషన్ కార్యాల యానికి గతనెలలో ఫిర్యాదులందాయని గుర్తు చేశారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జాతీయ ఆహారబధ్రత చట్టం 2013 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదో పరిశీలిస్తున్నామన్నారు. అంత కుముందు పట్టణంలోని రెండు బాలికల వసతిగృహాలు, రేషన్ డిపోలను కూడా ఆయన తనిఖీ చేశారు.