Share News

ఎరువులను అక్రమంగా తరలిస్తే చర్యలు

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:34 AM

ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా తరలించినా కఠిన చర్యలు తప్పవని పాలకొండ సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ హెచ్చరించారు. మంగళవారం భామినిలో ఎరువుల దుకాణంలో విక్రయాలు, నిల్వల నమోదును తనిఖీ చేశారు.

ఎరువులను అక్రమంగా తరలిస్తే చర్యలు
భామిని ఎరువుల స్టాక్‌ను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌

భామిని, జూలై7(ఆంధ్రజ్యోతి): ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా తరలించినా కఠిన చర్యలు తప్పవని పాలకొండ సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ హెచ్చరించారు. మంగళవారం భామినిలో ఎరువుల దుకాణంలో విక్రయాలు, నిల్వల నమోదును తనిఖీ చేశారు. గోదాంలో ఉన్న స్టాక్‌పై ఆరా తీశారు. అనంతరం జీసీసీ గోదాంను తనిఖీ చేసి సరుకుల సరఫరాలో జరిగిన ఆలస్యంపై సేల్స్‌మన్‌ను ప్రశ్నించారు. ముందుగా మనుమకొండకు సరుకులు పంపించి అనంతరం భామినికి సరఫరా చేయడంతో ఆలస్యమైందని అధికారులు వివరించారు. ఆ తర్వాత సబ్‌ కలెక్టర్‌ ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి బోధన, ఆరోగ్యం, వసతి, ఆహార సౌకర్యాలపై ఆరా తీశారు. క్రమశిక్షణతో చదివి లక్ష్యాలను సాధించాలని సూచించారు. పాఠశాల ప్రాంగణం, మరుగుదొడ్లు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదేశించారు. మరుగుదొడ్లుకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. పాఠశాల అదనపు భవనం నిర్మాణం పూర్తయినా వినియోగంలోకి రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు సబ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ పరిశీలనలో తహసీల్దార్‌ వి.నాగేం ద్ర ప్రసాద్‌, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 10:51 AM