ఎరువులను పక్కదారి పట్టిస్తే చర్యలు
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:28 AM
Action Against Diversion of Fertilizers ఎరువులను పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. శుక్రవారం భామిని రైతు సేవా కేంద్రంలో రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలు అందించారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విత్తనాలు, పథకాలు, సబ్సిడీలు, ఇతర సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
భామిని, జూన్ 19(ఆంధ్రజ్యోతి): ఎరువులను పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. శుక్రవారం భామిని రైతు సేవా కేంద్రంలో రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలు అందించారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విత్తనాలు, పథకాలు, సబ్సిడీలు, ఇతర సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాగా ఎరువుల విక్రయాలపై పులువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భామినిలో కొంతమంది డీలర్లు సరిహద్దులో ఉన్న ఒడిశా ప్రాంతానికి ఎరువులను తరలించేస్తున్నారని ఆరోపించారు. ఆర్‌ఎస్‌కేల ద్వారా ఎరువులు అందించాలని వారు కోరారు. దీనిపై సబ్ కలెక్టర్ స్పందిస్తూ.. అక్రమాలకు అవకాశం లేకుండా ఎరువులు విక్రయాలు చేపట్టాలన్నారు. డీలర్లు వద్ద ఉన్న నిల్వలు, విక్రయాల సమాచారాన్ని రోజూ అందించాలని వ్యవసాయశాఖ ఏడీ రత్నకుమారిని, ఏవో తిలక్‌లకు ఆదేశించారు. అనంతరం చిన్నదిమిలి కాలనీలో నిర్వహిస్తున్న ‘సర్’ ప్రక్రియను తనిఖీ చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, ఇంటింటి ధ్రువీకరణ, నమోదు తదితర వాటిపై ఆరా తీశారు. అక్కడి నుంచి నేరుగా మూలగూడ చేరుకుని భూముల రీ సర్వేను పరిశీలించారు. రీసర్వేపై రైతుల అభి ప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం, విద్యాబోధనపై ఆరా తీశారు ఆయన వెంట సర్వేయర్ రాజేష్, ఆర్‌ఐ మణి ప్రభాకర్, సిబ్బంది ఉన్నారు.