విజయ సాధనే లక్ష్యం
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:14 AM
స్థానిక ఎన్నికల్లో విజయ సాధనే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
టీడీపీలో 58 కుటుంబాల చేరిక
గంట్యాడ, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో విజయ సాధనే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. శనివారం రామవరం గ్రామానికి చెందిన పూడి సత్యనారాయణ, పూడి శ్యామ్‌కుమార్ ఆధ్వర్యం లో 58 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వారికి మంత్రి.. కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయు డు, యువ నాయకు డు నారా లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందు తుందని చెప్పారు. పాత, కొత్త నాయ కుల కలయికతో స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ వన్‌సైడ్ విక్టరీగా మారాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్‌నాయుడు, కొప్పల వెలమ రాష్ట్ర డైరక్టరు అల్లు విజయకుమార్, పద్మశాలి సంఘ రాష్ట్ర డైరక్టరు నీలంశెట్టి భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.