Swarna Andhra స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించాలి
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:41 PM
Achieve the Goals of Swarna Andhra స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించడంలో జిల్లా ముందంజలో ఉండాలని, ఇందుకోసం జిల్లా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదే శించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, మార్చి6(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించడంలో జిల్లా ముందంజలో ఉండాలని, ఇందుకోసం జిల్లా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదే శించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ‘వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ప్రాథమిక రంగాల్లో పురోగతి కనిపించాలి. ప్రభుత్వం నిర్దేశించిన వివిధ అభివృద్ధి సూచికల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా టాప్-5లో నిలవాలి. ప్రగతి నివేదికల్లో వెనుకంజలో ఉంటే ఏమాత్రం ఉపేక్షించబోం. రాష్ట్రస్థాయి డేటాను పరిశీలించి దానిని మండలాల వారీగా విశ్లేషించుకోవాలి. క్షేత్రస్థాయిలో లక్ష్యాలను అధిగమించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ నిర్వహించాలి. అది పంచాయతీకి అదనపు ఆదాయంగా మారాలి. ప్రతి జిల్లా అధికారి ఒక గ్రామాన్ని ‘ముస్తాబు’గా తయారుచేయాలి. అందరూ మరుగుదొడ్లు వినియోగించుకునేలా చూడాలి. ఉపాధి హామీ కింద దత్తత గ్రామాల్లో మొక్కలు నాటాలి. గ్రామాల్లోని ప్రజల ఫోన్ నెంబర్లు సేకరించి వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రభుత్వ పథకాలు, సమాచారాన్ని నేరుగా వారికి చేరవేయాలి. ’ అని తెలిపారు. అనంతరం సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన స్వర్ణాంధ్ర-2047 క్యాలెండర్లను ఆవిష్కరించారు.
15లోగా సీఎస్‌సీ పనులు పూర్తి చేయాల్సిందే..
జిల్లాలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ (సీఎస్‌సీ) పనులను ఈ నెల 15 లోగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆర్‌డబూ్ల్యుఎస్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షిం చారు. ‘ మంజూరైన ప్రతి సీఎస్‌సీని పూర్తిచేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలి. దీనిని ఒక సవాల్‌గా తీసుకుని.. రోజువారీ ప్రగతిని వివరించాలి. మార్చి 15 నాటికి ఏ ఒక్క పని కూడా పెండింగ్‌లో ఉండకూడదు. ఒక పని జరుగుతున్నప్పుడు మిగిలిన పనులను నిలిపివే యడం సరికాదు. అన్నీ సమాంతరంగా సాగాలి. పనుల నిర్వహణలో ప్రతి అధికారికి ఒక స్పష్ట మైన ప్రణాళిక, వ్యూహం ఉండాలి. మంజూరైన ప్రతి పని తక్షణమే ప్రారంభం కావాలి. వాటి ఫొటోలు పంపించాలి. గ్రౌండింగ్ కాని పనులు ఏవీ ఉండకూడదు. నిర్మాణాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మాణం జరగాలి.’ అని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జేసీ సి.యశ్వంత్ కుమార్‌రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ సప్నిల్ జగన్నాథ్, డీఆర్వో హేమలత, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, గిరిజన సంక్షేమశాఖ డీడీ విజయశాంతి పాల్గొన్నారు.