Share News

పదో తరగతిలో శతశాతం ఫలితాలు సాధించాలి

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:09 AM

పదో తరగతిలో శతశాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు.

పదో తరగతిలో శతశాతం ఫలితాలు సాధించాలి
విద్యార్థులకు ప్రశ్నలు వేస్తున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

- కలెక్టర్‌ ప్రభాకర్‌రెడి

కురుపాం, ఫిబ్రవరి12 (ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో శతశాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. కురుపాం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. విద్యా ప్రమాణాలు, వసతులు, విద్యార్థులకు అందుతున్న భోజనం, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారికి పాఠాలను బోధించారు. ప్రశ్నలు అడిగా వారి విద్యా ప్రమాణాలను తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించి, నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆటలు, క్రీడలతో విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా కాసేపు విద్యార్థులతో ఆటలు ఆడించి, వ్యాయామాలు చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉమామహేశరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 12:09 AM