Pass Results శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:05 AM
Achieve 100% Pass Results విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో బ్రహ్మాజీరావు ఆదేశించారు. మంగళవారం భామిని కేజీబీవీ, ఆదర్శ పాఠశా లను ఆకస్మికంగా సందర్శించారు. తొలుత కేజీబీవీలో విద్యార్థినుల నోట్ బుక్‌లను పరిశీలించారు.
భామిని, జనవరి 6(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో బ్రహ్మాజీరావు ఆదేశించారు. మంగళవారం భామిని కేజీబీవీ, ఆదర్శ పాఠశా లను ఆకస్మికంగా సందర్శించారు. తొలుత కేజీబీవీలో విద్యార్థినుల నోట్ బుక్‌లను పరిశీలించారు. విద్యాశాఖ అమలు చేసిన వంద రోజుల యాక్షన్ ప్లాన్‌పై ఆరా తీశారు. ఇక ఆదర్శ పాఠశాలలో ఎఫ్‌ఏ-3 పరీక్ష గదులను పరిశీలించారు. బుక్‌లెట్, జవాబులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్ నిర్వహణ, ముఖ్యమంత్రి ప్రారంభించిన క్లికర్స్ అమలుపై ఆరా తీశారు. పరీక్ష సమయంలో ఎవరు గైర్హాజరవ్వకుండా చూడాలన్నారు. ఎకనామిక్స్ ,సివిక్స్ సబ్జెక్టు పోస్టులను గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకులతో భర్తీ చేసినట్లు వివరించారు. తరగతి గదులు సందర్శించే సమయంలో టాయిలెట్ రూమ్ నుంచి దుర్వాసన రావడంతో స్లీపర్లను పిలిపించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంఈవోలు భాస్కరరావు, శ్రీనివాసరావు, పాఠశాల ప్రిన్సిపాల్ బాబూరావు తదితరులు ఉన్నారు.