Share News

అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

ABN , Publish Date - May 14 , 2026 | 12:22 AM

జిల్లా కేంద్రంలో బాలికపై అత్యా చారానికి పాల్పడిన రాజేటి సత్యారావు(53)అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్టు విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్‌.రాఘవులు బుధవారం విలేకరులకు తెలిపారు.

 అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు
నిందితుడితో పోలీసులు

విజయనగరం, మే 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో బాలికపై అత్యా చారానికి పాల్పడిన రాజేటి సత్యారావు(53)అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్టు విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్‌.రాఘవులు బుధవారం విలేకరులకు తెలిపారు. వేసవి సెలవులు కావడంతో తన అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలిక ఈ నెల 10న నిందితుడి ఇంటికి పాలు పోసేందుకు వెళ్లిందని తెలిపారు. పాల డబ్బులు ఇస్తానని చెప్పి లోపలికి పిలిచి న నిందితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతుచూస్తానని నిందితుడు బెదిరించాడని తెలిపారు. ఒంటిమీద గాయాలను చూసి తల్లి ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని బాలిక బయట పెట్టిందని డీఎస్పీ వివరించారు. ఈ మేరకు విజయనగరం మహిళా పోలీస్‌ స్టేషన్‌లో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ జి.శిరీష పోక్సో కేసు నమోదు చేశారని చెప్పారు. నగరంలోని బీసీ కాలనీకి చెందిన నిందితుడు రాజేటి సత్యారావును సీఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలో అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారని డీఎస్పీ రాఘవులు చెప్పారు.

Updated Date - May 14 , 2026 | 12:22 AM