హత్యకేసులో నిందితుడి అరెస్టు
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:27 AM
గంట్యాడ మండలం రేగుబిల్లి గ్రామం లో జరిగిన హత్య కేసులో నిందితుడు గుల్లిపిల్లి శ్రీను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు శుక్రవారం తెలిపారు.
విజయనగరం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): గంట్యాడ మండలం రేగుబిల్లి గ్రామం లో జరిగిన హత్య కేసులో నిందితుడు గుల్లిపిల్లి శ్రీను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు శుక్రవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రేగుబిల్లి గ్రామా నికి చెందిన బర్ల కృష్ణంనాయుడు, అదే గ్రామానికి చెందిన గుల్లిపిల్లి శ్రీనుకు మధ్య పొలానికి నీరు కట్టే సమయంలో ఘర్షణ తలెత్తింది. ఘర్షణ సమయంలో గుల్లిపిల్లి శ్రీను.. బర్ల కృష్ణంనాయుడు పీక నొక్కడంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రాసుపత్రికి చేర్పిం చగా, ఈనెల 11న చికిత్స పొందుతూ కృష్ణంనాయుడు మృతిచెందాడు. ఈనెల 5న జరిగిన ఈ ఘటనలో గంట్యాడ పోలీసులకు కృష్ణంనాయుడు బంధువులు ఫిర్యాదు చేయగా, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంత రం శుక్రవారం నిందితుడు గుల్లిపిల్లి శ్రీనును అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజులు రిమాండ్ విధించారు.