Voter Mapping పక్కాగా ఓటర్ల మ్యాపింగ్
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:17 PM
Accurate Voter Mapping జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ (ఎన్నికల రోల్స్), ఫారమ్‌ల పరిశీలన పక్కాగా జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత తెలిపారు. శనివారం తన చాంబర్‌లో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
పార్వతీపురం, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ (ఎన్నికల రోల్స్), ఫారమ్‌ల పరిశీలన పక్కాగా జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత తెలిపారు. శనివారం తన చాంబర్‌లో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన 2002 ఓటర్ల డేటాను 2025 డేటాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందన్నారు. ఇప్పటివరకు బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌వో) జిల్లాలో 68.53 శాతం మేర మ్యాపింగ్ పూర్తి చేసినట్టు చెప్పారు. గత ఏడాది జనవరి 6 నుంచి ఇప్పటివరకు 16,799 దరఖాస్తులను స్వీకరించగా వాటిలో 273 మాత్రమే వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కొత్తగా ఓటు హక్కు కోసం 7,437 దరఖాస్తులు (ఫారం-7) రాగా, 2,046 ఓట్లను తొలగించామని, కేవలం నాలుగు దరఖాస్తులు మాత్రమే పెం డింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. మిగిలినవి సక్రమంగా లేనందున తిరస్కరించినట్టు తెలిపారు. పేరు, చిరునామా లేదా ఫొటో మార్పుల కోసం 7,436 దరఖాస్తులు (ఫారం-8) రాగా, ఇప్పటికే 6,934 సవరణలు పూర్తి చేశామన్నారు.