Share News

Accurate Self Calculation పక్కాగా స్వీయ గణన

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:26 PM

Accurate Self Calculation జనగణన-2027లో భాగంగా నేటి నుంచి 30వ తేదీ వరకు పక్కాగా స్వీయ గణన జరగాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. దేశంలో తొలిసారిగా డిజిటల్‌ మోడల్‌లో ఇది జరగనుందని, శతశాతం నమోదు కావాలని సూచించారు. వచ్చేనెలలో జిల్లా వ్యాప్తంగా గృహ గణన జరగుతుందన్నారు.

Accurate Self Calculation  పక్కాగా స్వీయ గణన

పార్వతీపురం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): జనగణన-2027లో భాగంగా నేటి నుంచి 30వ తేదీ వరకు పక్కాగా స్వీయ గణన జరగాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. దేశంలో తొలిసారిగా డిజిటల్‌ మోడల్‌లో ఇది జరగనుందని, శతశాతం నమోదు కావాలని సూచించారు. వచ్చేనెలలో జిల్లా వ్యాప్తంగా గృహ గణన జరగుతుందన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత శాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ స్వీయ గణనలో భాగంగా ఎస్‌ఈ.సీఈఎన్‌ఎస్‌యూఎస్‌. జీవోవీ.ఇన్‌ పోర్టల్‌లో వ్యక్తగతంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. కుటుంబంలో ఒకరు ఫోన్‌ నెంబర్‌ ద్వారా లాగిన్‌ అయి, వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిగా ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చిన గుర్తింపు సంఖ్యను ఇంటికి వచ్చే గణకులకు తెలియజేయాలి. దీనివల్ల కచ్చితమైన సమాచారంతో పాటు సమయం ఆదా అవుతుంది. ఇందుకు సంబంధించి శాఖాధిపతుల వారీగా చేపట్టాల్సిన షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. దీనిని సకాలంలో పూర్తి చేసి రాష్ర్టాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలపాలి.’ అని తెలిపారు.

- ‘16న ప్రజా ప్రతినిఽధులందరూ స్వీయ గణన నమోదు చేసుకునేలా తహసీల్దార్లు బాధ్యత వహించాలి. ఈ నెల 17న జిల్లా, మండల కార్యాలయాల అధికారులు, 18న రాష్ట్ర, జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన వారు, పద్మ, అవార్డు గ్రహీతలు, క్రీడాకారులు, సీనీ, ప్రముఖ కళాకారులు, 19న, 28న రెండు విడతల్లో ఎస్‌హెచ్‌జీ , మెప్మా సభ్యులు, 20న, 30న ఉపాధి వేతనదారులు, 21న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, 22న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల సిబ్బంది, విద్యార్థులు, 23న అంగన్‌వాడీ వర్కర్లు, టీచర్లు, లబ్ధిదారులు, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు, 24న అన్ని గిరిజన ప్రాంతాలు, సంతలకు వచ్చే వారి కుటుంబ వివరాలు నమోదయ్యేలా చూడాలన్నారు. 26న జిల్లా కేం ద్రంతో పాటు మున్సిపాలిటీల్లో 5కే రన్‌ చేపట్టాలి. 27న షాపులు, పారి శ్రామిక కార్మికులు, బ్యాకింగ్‌ సిబ్బంది కుటుంబాలతో నమోదు చేయించాలి. ’ అని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో కె.హేమలత, సబ్‌ కలెక్టర్లు ఆర్‌.వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 11:26 PM