ఓవర్‌లోడ్‌తో ప్రమాదాలు
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:30 AM
పాలకొండ- రాజాం రూట్‌లో సంకిలి చెక్కర కర్మాగారానికి నిత్యం ఓవర్‌లోడ్‌తో చెరకును తరలి స్తుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఈ ఒక్క కర్మాగారమే నడుస్తోంది.
రేగిడి, ఫిబ్రవరి 15 (ఆంధ్ర జ్యోతి): పాలకొండ- రాజాం రూట్‌లో సంకిలి చెక్కర కర్మాగారానికి నిత్యం ఓవర్‌లోడ్‌తో చెరకును తరలి స్తుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఈ ఒక్క కర్మాగారమే నడుస్తోంది. ప్రస్తుతం చెరకు సీజన్ కావడంతో కటింగ్‌చేసిన 24 గంటల్లో కర్మాగారానికి తరలించకపోతే రికవరి తగ్గిపోయే ప్రమాదముంది. దీనికితోడు కటింగ్ ఆర్డర్ కూడా సకాలంలో దొరకడంలేదు. దీంతో త్వరగా నరికిన చెరుకును కర్మాగారా నికి తరలించాలన్న ఆలోచనతో ఓవర్‌లోడ్ చేస్తున్నారు. దీంతో ట్రాక్టర్లు, లారీలో రోడ్డుపై బోల్తాపడుతుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగు తోంది. విజయనగరం జిల్లాలోని రేగిడి, వంగర, సంతకవిటి తదితర మండలాలతోపాటు శ్రీకాకుళం జిల్లాలో నుంచి పలు మండలాల నుంచి చెరకు కర్మాగారానికి తరలిస్తున్నారు. ఇటీవల చిన్నశిర్లాం సెంటర్‌లో ఓవర్‌లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్ బోల్తాపడడంతో పాలకొండ- విశాఖ రోడ్డు రెండు గంటలు ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనాలను మళ్లించారు. ప్రధాన రహదారుల గుండా ఓవర్‌లోడ్‌తో చెరకు లారీలు తరలిస్తున్నా పోలీసులు, రవాణాశాఖ అధికారులు చోద్యంచూస్తుండడంపై సర్వత్రా విమర్శలొ స్తున్నాయి.