accident ఘోరం
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:40 AM
accident విజయనగరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెల్లూరు వద్ద ప్రయాణికులతో ఆగి ఉన్న వ్యాన్‌ను సోమవారం రాత్రి లారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు ఆక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఘోరం
దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ
ముగ్గురి మృతి
మరో ముగ్గురికి గాయాలు
విజయనగరం సమీపంలో ఘటన
విజయనగరం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): విజయనగరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెల్లూరు వద్ద ప్రయాణికులతో ఆగి ఉన్న వ్యాన్‌ను సోమవారం రాత్రి లారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు ఆక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డెంకాడ మండలం బొత్సపేటతో పాటు మరో గ్రామానికి చెందిన సుమారు 15 మంది ఒడిశాలోని రాయగడమజ్జి గౌరమ్మ దర్శనానికి సోమవారం రాత్రి 10.30 గంటల తర్వాత బయలుదేరారు. విజయనగరం దాటాక చెల్లూరు వద్దకు వచ్చేసరికి వాటర్ బాటిల్ కొందామని రోడ్డు పక్కన ఆపారు. 11 గంటల సమయంలో అటుగా వచ్చిన లారీ, ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొంది. ప్రమాద దాటికి అందరూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రదేశమంతా భయానకంగా మారింది. రాంబాబు (50), చిన్నారి మోహన్ నాయుడు (9), మజ్జి నారాయణరావు (45) తీవ్ర గాయాలతో ఘటనా ప్రదేశంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.