Share News

Acceptance of AgriGold bonds to begin from the 6th 6 నుంచి అగ్రిగోల్డ్‌ బాండ్ల స్వీకరణ

ABN , Publish Date - Nov 01 , 2026 | 12:04 AM

Acceptance of AgriGold bonds to begin from the 6th భోగాపురం మండలంలోని అగ్రిగోల్డ్‌ బాధితుల నుంచి బాండ్లను స్వీకరిస్తామని విశాఖపట్నం సీఐడీ డీఎస్పీ వి.చంద్రశేఖర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Acceptance of AgriGold bonds to begin from the 6th 6 నుంచి అగ్రిగోల్డ్‌ బాండ్ల స్వీకరణ

6 నుంచి అగ్రిగోల్డ్‌ బాండ్ల స్వీకరణ

భోగాపురం మండల బాధితులకు ఆహ్వానం

ప్రకటించిన సీఐడీ డీఎస్పీ చంద్రశేఖర్‌

విజయనగరం/ భోగాపురం, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): భోగాపురం మండలంలోని అగ్రిగోల్డ్‌ బాధితుల నుంచి బాండ్లను స్వీకరిస్తామని విశాఖపట్నం సీఐడీ డీఎస్పీ వి.చంద్రశేఖర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బాధితులంందరూ సంతకాలు చేసిన అగ్రిగోల్డ్‌ బాండు కలర్‌ జిరాక్స్‌, బ్యాంకు ఖాతా మొదటి పేజీ, పాన్‌ కార్డు, ఆధార్‌ జిరాక్స్‌, పాస్‌పోర్టు సైజు ఫొటోతో పాటు ఒరిజినల్‌ పత్రాలను తీసుకుని విజయనగరం పోలీస్‌ లైన్స్‌లోని సీఆర్‌పీఎఫ్‌ బ్యారక్స్‌కు హాజరుకావాలన్నారు. ఈనెల 6వ తేదీన చెరుకుపల్లి, గూడెపువలస, దల్లిపేట, గుడివాడ, జగ్గయ్యపేట గ్రామాల బాధితులు, 7వ తేదీన చేపలకంచేరు, కవులవాడ, కోట భోగాపురం, 9న ముంజేరు, నందిగాం, పోలిపల్లి, రాజాపులోవ, 10న రావాడ, సవరవల్లి, సబ్బన్నపేట, బైరెడ్డిపాలెం, 11న కొండ్రాజుపాలెం, ముక్కాం, రామచంద్రపేట, 12వ తేదీన అమటాంరాయవలస, తూడెం, భోగాపురం, చాకివలస గ్రామాలకు చెందిన అగ్రిగోల్డ్‌ బాధితులు రావాల్సి ఉంటుందని తెలిపారు. ఇచ్చిన సమయం ప్రకారం పూర్తి వివరాలతో హాజరుకావాలని కోరారు. ఈ అవకాశాన్ని అగ్రిగోల్డ్‌ బాధితులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

==================

Updated Date - Nov 01 , 2026 | 12:04 AM