Industrial Development పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:36 AM
Accelerating Industrial Development జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ తెలిపారు. అల్యూమినియం స్మెల్టర్ యూనిట్ ఏర్పాటు కోసం శుక్రవారం పెదకంచూరులో స్థల పరిశీలన చేశారు.
పాచిపెంట, ఏప్రిల్3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ తెలిపారు. అల్యూమినియం స్మెల్టర్ యూనిట్ ఏర్పాటు కోసం శుక్రవారం పెదకంచూరులో స్థల పరిశీలన చేశారు. ఏజెన్సీ ప్రాంతం అన్ సర్వే భూములు కావడం వల్ల ముందుగా అటవీ, రెవెన్యూశాఖలు సంయుక్తంగా సర్వే చేసి నివేదికలు అందించాలని ఆయన ఆదేశించారు. రిజర్వు ఫారెస్టు, రెవెన్యూ భూముల సరిహద్దులు గుర్తించాలన్నారు. అన్ సర్వే భూములు కావడం వల్ల సంక్షేమ పథకాలు, రాయితీలకు దూరమవుతున్నామని ఆ ప్రాంత గిరిజనులు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి చూసుకుంటారని ఆయన తెలిపారు. ఈ స్థల పరిశీలనలో జేసీతో పాటు పరిశ్రమల శాఖ అధికారి సీతారాం, తహసీల్దార్ డి.రవి, పరిశ్రమల ప్రోత్సాహక అధికారి బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.