ACB Raids in Salur సాలూరులో ఏసీబీ సోదాలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:42 PM
ACB Raids in Salur పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఎస్‌ఈ శ్రీనివాసరావు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై గురువారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు సాలూరు పట్టణంలో ఉన్న ఆయన మేనల్లుడు ఐ.నారా యణరావు ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.
సాలూరు రూరల్, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఎస్‌ఈ శ్రీనివాసరావు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై గురువారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు సాలూరు పట్టణంలో ఉన్న ఆయన మేనల్లుడు ఐ.నారా యణరావు ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తెల్లవారు జామునేఏసీబీ అధికారులు సాలూరు చేరుకున్నారు. వాహనాలను కాస్త దూరంగా ఉంచి శ్రీనివాసరావు బంధువు నారాయణరావు ఇంటికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. సాలూరుతో పాటు హైదరాబాద్, మధురవాడలోనూ ఏకకాలంలో ఏసీబీ సిబ్బంది సోదాలు చేశారు. కాగా వివరాలు తాము వెల్లడించబోమని, వచ్చిన ఫిర్యాదులపై ఇది సాధారణంగా జరిపే సోదాలేనని విశాఖ ఏసీబీ బృందం స్పష్టం చేసింది. ఏసీబీ అధికారుల తనిఖీల సమాచారంతో మరోవైప పట్టణంలో సబ్ రిజిస్ట్రార్, సబ్ ట్రెజరీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర కార్యాలయాల అధికారులు అప్రమత్తమయ్యారు.