డిగ్రీ కళాశాలలో అకడమిక్ ఆడిట్
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:14 AM
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు ఎన్.శ్రీధర్, బారువ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆంగ్ల అధ్యాపకులు పి.రామకృష్ణ ఆధ్వర్యంలో అకడమిక్ ఆడిట్ శుక్రవారం నిర్వహించారు.
పాలకొండ, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు ఎన్.శ్రీధర్, బారువ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆంగ్ల అధ్యాపకులు పి.రామకృష్ణ ఆధ్వర్యంలో అకడమిక్ ఆడిట్ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో బోధనా విధానాలు, విద్యా ప్రమాణాలు, అకడమిక్ తీరును, విద్యార్థుల శ్రేయస్సు కోసం కళాశాలలో ఏర్పరిచే వివిధ రకాల సదుపాయాలను పరిశీ లించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎం.శ్యాంబాబు, ఐక్యూఏసీ కో-ఆర్డిఏటర్ బి.రాజు, వైస్ ప్రిన్సిపాల్ జయమణి, అధ్యాపకులు పాల్గొన్నారు.