Share News

‘పాడితో ఆదాయం పుష్కలం’

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:18 AM

పాడితో ఆదాయం పుష్కలం గా లభిస్తుందని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు.

‘పాడితో ఆదాయం పుష్కలం’
లబ్ధిదారులకు చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే, పీవో

సీతంపేట రూరల్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): పాడితో ఆదాయం పుష్కలం గా లభిస్తుందని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. గురువారం చిన్నబగ్గ లో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో మెగా పాడి పశువుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన గోకులాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంద న్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని పాడిరైతులు వినియోగించు కోవాల న్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పశుగణాభివృద్థి సంస్థ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన ఏర్పాటైంది. మేలు జాతి లేగదూడల రైతులకు బ హుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధశాఖ అధికారి టి.మన్మథరావు, పాలకొండ ఏఎంసీ చైర్మన్‌ బి.సంధ్యారాణి, జేడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 12:19 AM