Share News

రెండేళ్లలో సంపూర్ణ ప్రగతి

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:24 AM

కూట మి ప్రభుత్వం రెండేళ్లలో సంపూర్ణ ప్రగతిని సాధించిం దని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు.

రెండేళ్లలో సంపూర్ణ ప్రగతి

  • ఎమ్మెల్యే అదితి గజపతిరాజు

విజయనగరం టౌన్‌, జూన్‌ 16(ఆంద్రజ్యోతి): కూట మి ప్రభుత్వం రెండేళ్లలో సంపూర్ణ ప్రగతిని సాధించిం దని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం స్థానిక బాలాజీ కూడలి వద్ద ప్రజా చైతన్య పాలనా సమీక్ష ఉత్సవాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు దశలవారీగా అమలు పరుస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బీజీపీ జిల్లా అధ్యక్షు డు రాజేష్‌ వర్మ, రాష్ట్ర కార్యదర్శి ప్రసాదులు ప్రసాద్‌, ఎంపీడీవో వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

నగరంలో రహదారుల అభివృద్ధికి కృషి..

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామ ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. నగరం లోని ఐదవ డివిజన్‌ పరిధిలోని విజ్జీ మైదానం రోడ్డు వద్ద రాజానగర్‌ పార్కు, ఆరవ డివిజన్‌ పరిధిలోని మాధురీనగర్‌ ప్రాంతాలలో వీఎంఆర్‌డీఏ నిధులతో పలు అభివృద్ధి పనులకు ఆమె మంగళవారం శంకు స్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నగరంలోని రోడ్లు, కాలువల దుస్థితి అధ్వానంగా ఉండేదని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ దశలవారీ గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 12:24 AM